మందమర్రిలో వర్షనష్ట ప్రాంతాలు పరిశీలించిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల, జూన్ 14 (చైతన్యగళం): మందమర్రి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగి పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కలిసి నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. దీపక్ నగర్, పాలచెట్టు, 2వ జోన్‌లో కాంగ్రెస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ నివాసం వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అలాగే సరస్వతి స్కూల్‌పై చెట్లు పడటంతో...