CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 8:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

మర్రిగూడ, జూన్ 19 (చైతన్యగళం): నాంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దూది రాజు ప్రజలకు పిలుపునిస్తూ, “వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి” అని అన్నారు.క్రిమినల్, సివిల్, బ్యాంకు రికవరీ కేసుల్లో ఇరువర్గాలు రాజీ పడితే సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని ఆయన వివరించారు.న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని నాంపల్లి, చింతపల్లి, మర్రిగూడ ప్రాంతాల బాధితులు తప్పక వినియోగించుకోవాలని సీఐ దూది రాజు సూచించారు.