ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – చెర్కూర్ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు
వెల్దండ, జూన్ 10 (చైతన్యగళం):స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెర్కూర్ గ్రామంలో వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి నిర్వహించే విధానంపై అవగాహన కార్యక్రమం, గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ పరిశుభ్రత మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి...