అక్రమ ఇసుక డంపుల స్వాధీనం

కరీంనగర్, జూన్ 15 (చైతన్యగళం): జమ్మికుంట మండలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ దాడి నిర్వహించి మూడు అక్రమ ఇసుక డంపులు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. విలాసాగర్ గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన ఇసుకను గుర్తించి సీజ్ చేశారు.ఒక పెద్ద డంపులో 100 ట్రాక్టర్ల లోడుల ఇసుక, మిగిలిన రెండు డంపుల్లో మరో 50 ట్రాక్టర్ల లోడుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 150 ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుకతో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు ట్రాక్టర్లను జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.“అక్రమ...