వర్షాల మధ్య నిరంతర పర్యవేక్షణ – ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు
హైదరాబాద్, జూన్ 19 (చైతన్యగళం):
సిటీ లో కురుస్తున్న వర్షాల కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్.
DGP సి.వి. ఆనంద్ ఆదేశాల మేరకు, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో, జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయెల్ డేవిస్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు నిరంతరం పని చేస్తున్నాయి.
కాచిగూడ పరిధిలోని టూరిస్ట్ హోటల్ వద్ద విరిగిపడిన చెట్టును తొలగిస్తున్న దృశ్యంలో, కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ ట్రాఫిక్ సిబ్బంది, DRF టీంతో కలిసి ముమ్మరంగా పనిచేశారు.ఈ చర్యలతో వర్షాల మధ్య ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.