చిన్నారి వైద్య ఖర్చులకు అండగా నిలిచిన హోమ్ గార్డ్స్
హైదరాబాద్, జూన్ 22 (చైతన్యగళం): నిరంతరం విధినిర్వహణలో అప్రమత్తతతో సేవలందిస్తున్న కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఒక చిన్నారి విషయంలో మానవత్వాన్ని చాటుకున్నారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తున్న కె. నాగయ్య కుమార్తె అర్పుద (6 ఏళ్లు) ఆకస్మికంగా షుగర్ లెవెల్స్ పెరగడంతో అస్వస్థతకు గురైంది. ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న నాగయ్యకు తోటి సిబ్బంది ధైర్యం చెప్పి, ఇన్స్పెక్టర్ కౌశిక్ ఆధ్వర్యంలో అందరూ ఒక్కటై ₹40 వేల రూపాయలు సాయం అందించారు. సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి కోలుకుంది....