CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

చిన్నారి వైద్య ఖర్చులకు అండగా నిలిచిన హోమ్ గార్డ్స్

హైదరాబాద్, జూన్ 22 (చైతన్యగళం): నిరంతరం విధినిర్వహణలో అప్రమత్తతతో సేవలందిస్తున్న కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఒక చిన్నారి విషయంలో మానవత్వాన్ని చాటుకున్నారు.

కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తున్న కె. నాగయ్య కుమార్తె అర్పుద (6 ఏళ్లు) ఆకస్మికంగా షుగర్ లెవెల్స్ పెరగడంతో అస్వస్థతకు గురైంది. ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న నాగయ్యకు తోటి సిబ్బంది ధైర్యం చెప్పి, ఇన్స్పెక్టర్ కౌశిక్ ఆధ్వర్యంలో అందరూ ఒక్కటై ₹40 వేల రూపాయలు సాయం అందించారు.

సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి కోలుకుంది. ఈ కార్యక్రమంలో SIలు వీరమల్లు, జ్ఞానేశ్వర్, శ్రీకాంత్, కె.టి. నాయక్, రాకేష్, ASI రాజశేఖర్ రెడ్డి, ఠాగూర్, విజయ్ కుమార్, శ్రీనివాస్, భాస్కర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హోమ్ గార్డ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంలో పలువురు పేర్కొంటూ, “దేశమంటే మట్టి కాదు, మనుషుల మధ్య బంధాలు, ఆప్యాయతలు. విలువలు కాపాడుకుంటూ ఉన్నతంగా ఎదిగిన వాడే మానవత్వం ఉన్న మనిషి” అని అన్నారు.

కాచిగూడ ట్రాఫిక్ సిబ్బంది చూపిన ఈ మానవత్వం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. హ్యాట్సాఫ్ ఆఫీసర్స్… మీకు అభినందనలు.