తండ్రి.. కుటుంబానికి వటవృక్షం
ప్రేమను మౌనంగా పంచే మహోన్నత వ్యక్తిత్వానికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు ప్రపంచంలో ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో తండ్రి స్థానం అత్యంత విశిష్టమైనది. తల్లి ప్రేమను మమతగా వ్యక్తపరుస్తే, తండ్రి ప్రేమ బాధ్యతల రూపంలో ప్రతిఫలిస్తుంది. కుటుంబ సంక్షేమం, పిల్లల భవిష్యత్తు, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం శ్రమించే తండ్రుల త్యాగం, అంకితభావం, ప్రేమకు గుర్తింపుగా జరుపుకునే ప్రత్యేక దినోత్సవమే ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం జూన్ నెల మూడో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ వేడుక, తండ్రి పాత్రను...