మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్

నందికొట్కూరు, జూన్ 13 (చైతన్యగళం):నంద్యాల జిల్లాను మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు నిరంతర చర్యలు కొనసాగిస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ పర్యవేక్షణలో, జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో విస్తృతమైన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలోని అనుమానాస్పద గృహాలు, వాణిజ్య సంస్థల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు...