సింగరేణి సంస్థ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం – ఉప ముఖ్యమంత్రి భట్టి
మంచిర్యాల, జూన్ 14 (చైతన్యగళం): సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి అని, కార్మికుల చెమటతో వెలుగులు అందిస్తున్న ఈ సంస్థను అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు....