మల్లన్న స్వామి దేవాలయంలో భక్తుల సందడి

అమావాస్య సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు మెదక్ , జూన్ 15 (చైతన్యగళం): అమావాస్య సందర్భంగా కొయ్యగుట్ట మల్లన్న స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, రేగోడ్, పెద్దనర్సాపూర్, గోపాల్‌పేట్, ఎల్లారెడ్డి, మెదక్ పట్టణం తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా...