బస్సులు పునఃప్రారంభించాలి – పీఆర్జీ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త
ఇబ్రహింపట్నం, జూన్ 9(చైతన్య గళం): ఇబ్రహింపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో వేసవి సెలవుల పేరుతో నిలిపివేసిన గ్రామీణ బస్సులను వెంటనే పునఃప్రారంభించాలని పీఆర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్త ఒక ప్రకటనలో కోరారు.జూన్ 14తో వేసవి సెలవులు ముగియగా, జూన్ 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు మళ్లీ నడపాలని ఆయన ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు.వేసవి కాలంలో బస్సులు లేక రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు...