CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 11:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆర్టీసీ డిపో పరిధిలో వేసవి సెలవుల పేరుతో నిలిపివేసిన గ్రామీణ బస్సులను వెంటనే పునఃప్రారంభించాలని పీఆర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్త ఒక ప్రకటనలో కోరారు.

జూన్ 14తో వేసవి సెలవులు ముగియగా, జూన్ 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు మళ్లీ నడపాలని ఆయన ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు.

వేసవి కాలంలో బస్సులు లేక రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రవీందర్ గుప్త పేర్కొన్నారు. పలుమార్లు కోరినా అధికారులు స్పందించలేదని, కనీసం ఇప్పుడు అయినా జూన్ 15 నుంచి బస్సులు నడపాలని ఆయన డిమాండ్ చేశారు.