CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 10:50 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఖచ్చితమైన డేటా సేకరణతో సుస్థిర తెలంగాణ నిర్మాణం – యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్

తలకొండపల్లి, జూన్ 9 (చైతన్యగళం):
తెలంగాణలో 2027 జనాభా గణన జాతీయ కార్యక్రమం తొలి విడత విజయవంతంగా ముగిసిందని తలకొండపల్లి యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ తెలిపారు.

జనగణన ద్వారా దేశంలోని ప్రజల సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం లభిస్తుందని, అది విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో సమర్థవంతమైన ప్రణాళిక, వనరుల సమాన పంపిణీ, సంక్షేమ పథకాల రూపకల్పనకు కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఖచ్చితమైన డేటా సేకరణతో దేశ పురోగతిని అంచనా వేయటమే కాకుండా, సుస్థిరమైన తెలంగాణ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం అని ఆయన నొక్కి చెప్పారు. మే 10 వరకు స్వీయ గణన కొనసాగగా, మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించారని వివరించారు.