ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి – ఏబీవీపీ
మెదక్, జూన్ 10 (చైతన్యగళం): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డీఈఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ రేటు తగ్గిపోతున్నదని పేర్కొంటూ, పాఠశాలలను పటిష్ఠపరచి అవసరమైన వసతులు కల్పించి,...