రాంరెడ్డిపల్లిలో బడిబాట కార్యక్రమం
మర్రిగూడ, జూన్ 19 (చైతన్యగళం): మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మన ఊరు–మన బడి ప్రణాళికలో భాగంగా శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లప్పంగి నరసింహ మాట్లాడుతూ, “ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తే ఫీజులు పేద కుటుంబాలకు భారంగా మారతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, కంప్యూటర్ శిక్షణ, స్టడీ కిట్లు, అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి” అని వివరించారు. ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు...