మర్రిగూడ, జూన్ 19 (చైతన్యగళం): మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మన ఊరు–మన బడి ప్రణాళికలో భాగంగా శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ లప్పంగి నరసింహ మాట్లాడుతూ, “ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తే ఫీజులు పేద కుటుంబాలకు భారంగా మారతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, కంప్యూటర్ శిక్షణ, స్టడీ కిట్లు, అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి” అని వివరించారు.
ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, రూప్ సింగ్, మాస బాలరాజు, రేణుక, వెంకటేశ్వర్లు, కృష్ణ, నాగేశ్వర్, రత్నకుమారి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.