భక్తి, శక్తి, విశ్వాసానికి చిరునామా.. శ్రీ మహాశక్తి దేవాలయం

16వ వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం ఉత్తర తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా మహాశక్తి క్షేత్రం   కరీంనగర్ నగర నడిబొడ్డున చైతన్యపురిలో వెలసిన శ్రీ మహాశక్తి దేవాలయం నేడు ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భక్తి, శక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ దివ్యక్షేత్రం ఈ నెల 19న తన 16వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోనుంది. ఈ సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడుతూ భక్తులను ఆహ్వానిస్తోంది. జగద్గురు హంపి పీఠాధిపతి శ్రీ...