CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:28 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎలిగేడు సర్పంచ్‌కు ఘన సన్మానం

ఎలిగేడు, జూన్ 9 (చైతన్యగళం): ఎలిగేడు గ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ను మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి సత్కరించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రవీణ్ గతంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసి అనేకమంది విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఆయన నాయకత్వంలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు కే. సతీష్, ఎం. ఆనంద్, డి. లక్ష్మణ్, ఎం. సంతోష్ కుమార్, వి. శ్రీనివాస్, ఆర్. నాని, జె. అజిత్ రెడ్డి, ఎం. బానిష్, టి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.