విద్యార్థులు రాజ్యాంగ విలువలను అలవర్చుకోవాలి

సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవరావు పిలుపు హుస్నాబాద్‌, నవంబర్ 26 (చైతన్యగళం): విద్యార్థులు రాజ్యాంగ విలువలను అవగాహన చేసుకుని, వాటిని తమ జీవితాల్లో అలవర్చుకోవాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవరావు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ.. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. డాక్టర్‌...