CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 11:02 am Posted by : CHAITHANYA GALAM NEWS

నంది అవార్డు గ్రహీత మాలోత్‌ హనుమంతరావుకు అభినందనలు

  • జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడిగ నరసింహనాయుడు (వెంకన్న)కు సన్మానం

మిర్యాలగూడ, నవంబర్‌ 25 (చైతన్యగళం‌):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత, మూడు రాష్ట్రాల ఆల్‌ కాస్ట్‌ మ్యారేజ్‌ బ్యూరోస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మాలోత్‌ హనుమంతరావు తెలంగాణ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడిగ నరసింహనాయుడు (వెంకన్న)ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మే 27న నంది అవార్డు అందుకున్న హనుమంతరావును పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, సామాజిక సేవ, కులాంతర వివాహాల ప్రోత్సాహం, సామాజిక సమానత్వం కోసం కృషి కొనసాగిస్తానని తెలిపారు.