జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు హుస్నాబాద్‌ విద్యార్థిని అఖిల ఎంపిక

హుస్నాబాద్‌, నవంబర్‌ 22 (చైతన్యగళం): హుస్నాబాద్‌కు చెందిన బానోత్‌ అఖిల తెలంగాణ బాలికల జట్టు తరఫున జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 24 నుంచి 28 వరకు పంజాబ్‌లోని భటిండాలో నిర్వహించనున్న 44వ జాతీయ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో అఖిల పాల్గొననుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన అఖిలను మల్‌చెరువు తండా కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు శ్రీనివాస్‌ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.