చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కౌన్సిలర్ పాపిశెట్టి రాము
ఆమనగల్, నవంబర్ 22 (చైతన్యగళం): చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రాము పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా పాపిశెట్టి రాము మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పోలియో రహిత...