చిన్నారుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత

నల్లచెరువును పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం: సర్పంచ్‌ కట్ట జయమ్మ యాదయ్య మాడుగుల, నవంబర్‌ 22 (చైతన్యగళం): మాడుగుల మండలం నల్లచెరువు గ్రామంలో పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ కట్ట జయమ్మ యాదయ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కట్ట జయమ్మ యాదయ్య మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యమే గ్రామ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక...