ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూముల వినియోగం

జంగిలిగొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు.. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ – ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్‌ మహబూబాబాద్‌, నవంబర్‌ 21 (చైతన్యగళం): జంగిలిగొండ గ్రామంలోని ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించే బాధ్యత తనదేనని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్‌ స్పష్టం చేశారు. గ్రామంలో గుర్తించిన ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని, ఇందుకోసం జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడతామని తెలిపారు. మహబూబాబాద్‌ మండలం జంగిలిగొండ...