కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఈ నెల 23న లక్ష మందితో పాదయాత్రకు ఏర్పాట్లు.. ఎల్కతుర్తి మండల బీజేపీ నాయకుల పిలుపు ఎల్కతుర్తి, నవంబర్ 21 (చైతన్యగళం): ఈ నెల 23న కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఎల్కతుర్తి మండల బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రభారి...