బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితుడి శస్త్రచికిత్సకు ఎల్‌ఓసీ మంజూరు చేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిడిశెట్టి రాజు కోహెడ, నవంబర్‌ 21 (చైతన్యగళం): బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద పూజారి మిశ్రా శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, కంటెస్టెడ్‌ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. బాధితుడి శస్త్రచికిత్సకు రూ.10 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా...