రోడ్డు విస్తరణకు ఇంటి యజమాని సహకారం

పనులను పర్యవేక్షించిన తలకొండపల్లి సర్పంచ్‌ కటికెల శేఖర్‌ యాదవ్‌ తలకొండపల్లి, నవంబర్‌ 21 (చైతన్యగళం): గ్రామ అభివృద్ధిలో భాగంగా తలకొండపల్లి మండల కేంద్రంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఇంటి యజమాని సహకరించడంతో పనులకు మార్గం సుగమమైంది. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఇంటి భాగాన్ని తొలగించేలా సర్పంచ్‌ కటికెల శేఖర్‌ యాదవ్‌ చొరవ తీసుకున్నారు. రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న దోర్నాల శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి యజమానితో సర్పంచ్‌ స్వయంగా మాట్లాడి, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సర్పంచ్‌ విజ్ఞప్తికి...