నేర న్యాయ వ్యవస్థలో ఫోరెన్సిక్ సైన్స్ కీలకం
న్యాయవాదులకు అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్ మహబూబాబాద్ (చైతన్యగళం): నేర న్యాయ వ్యవస్థలో న్యాయమైన విచారణ, సమర్థవంతమైన న్యాయవాద వృత్తి నిర్వహణకు ఫోరెన్సిక్ సైన్స్ ఎంతో కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్ అన్నారు. న్యాయవాదులకు ఫోరెన్సిక్ విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో మహబూబాబాద్ బార్ అసోసియేషన్, ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్...