ఈ నెల 23న కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. కార్యకర్తలు భారీగా తరలిరావాలి: గొల్లపల్లి వీరాచారి హుస్నాబాద్‌, నవంబర్‌ 21 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 23న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మహా పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం...