పుల్లంపల్లిలో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 418వ జయంతి వేడుకలు
చిగురుమామిడి, నవంబర్ 21 (చైతన్యగళం): చిగురుమామిడి మండలం పుల్లంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 418వ జయంతి మహోత్సవాన్ని కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ అలవల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీకాంత్ చారి హాజరయ్యారు. కొత్తపల్లి వినోద్‌కుమార్, కానవీణి శివకుమార్, జనవేణి మల్లేశం,...