CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 5:00 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పుల్లంపల్లిలో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 418వ జయంతి వేడుకలు

చిగురుమామిడి, నవంబర్‌ 21 (చైతన్యగళం): చిగురుమామిడి మండలం పుల్లంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 418వ జయంతి మహోత్సవాన్ని కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వకర్మ పరిషత్‌ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ అలవల శంకర్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీకాంత్‌ చారి హాజరయ్యారు. కొత్తపల్లి వినోద్‌కుమార్‌, కానవీణి శివకుమార్‌, జనవేణి మల్లేశం, కొత్త మధు, వస్తాదుల శ్రీనివాస్‌, కొత్తపల్లి సుగుణ, కొత్తపల్లి రాజవ్వ, పోలోజు సంపద తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందరూ కలిసికట్టుగా నిర్వహించడం అభినందనీయమన్నారు.