అర్హులైన పేదలకు పెన్షన్లు నిరాకరించడం అన్యాయం

తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి సమగ్రంగా పరిశీలించాలి: పోగుల సైదులు గౌడ్ నల్లగొండ, నవంబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ పలువురు అర్హులైన పేదలకు న్యాయం జరగకపోవడం విచారకరమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ అన్నారు. చిన్నచిన్న కారణాలను సాకుగా చూపుతూ పేదల పింఛను దరఖాస్తులను తిరస్కరించడం ప్రభుత్వ సంక్షేమ లక్ష్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలోని 34వ పేజీ,...