తంగళ్లపల్లిలో కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
విద్యార్థినులతో గణిత సమస్యలు పరిష్కరింపజేసి విద్యా ప్రమాణాల పరిశీలన.. వసతి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు కోహెడ, నవంబర్ 17 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో ముచ్చటించారు. గణితంలోని సమస్యలను బోర్డుపై స్వయంగా పరిష్కరింపజేసి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. చదువు, ఉపాధ్యాయుల బోధనా తీరుపై వివరాలు...