మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలి
ప్రతి పది పాయింట్లకు ఒక అవకాశం కల్పించాలి: మాల జేఏసీ చైర్మన్ ఆస లక్ష్మణ్ హుస్నాబాద్, నవంబర్ 17 (చైతన్యగళం): ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలు చేస్తున్న రోస్టర్ విధానంలో మాల, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని మాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆస లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా మాల జేఏసీ నాయకులు రాష్ట్ర వర్గీకరణ ఉపసంఘం సభ్యుడు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్...