పట్టభద్రుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. నిరుద్యోగ యువతకు అండగా ఉంటా

బహుజన బిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి: ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌ మహబూబాబాద్‌: పట్టభద్రుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువత ఆశయ సాధన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచానని తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి డాక్టర్‌ నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పీహెచ్‌డీ సాధించానని, ప్రజా సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. పట్టభద్రులు తనను...