కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్‌పై ఉత్కంఠ
ఒక్క టికెట్.. ముగ్గురు ఆశావహులు.. గోలి శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఉప్పల వెంకటేష్‌లలో ఎవరికి అవకాశం? కల్వకుర్తి, నవంబర్ 13 (చైతన్యగళం): రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా గోలి శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఉప్పల వెంకటేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండటంతో పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒక్క టికెట్ కోసం ముగ్గురు నాయకులు ఆశలు పెట్టుకోవడం, వారి అనుచర వర్గాలు...