నీటిపారుదల శాఖ డీఈఈ నివాసంలో ఏసీబీ సోదాలు
రూ.100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడి నాగర్‌కర్నూల్, నవంబర్ 12 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): నాగర్‌కర్నూల్ జిల్లాలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు ఒకేసారి పలు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ, మాధవరం ప్రాంతాల్లో ఉన్న ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు...