CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 3:44 pm Posted by : rakeshkashaveni12@gmail.com

బెదిరింపులకు భయపడేది లేదు.. చట్టపరంగా ఎదుర్కొంటాం

 తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనుచరుడిపై చర్యలు తీసుకోవాలి
 కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్

దుబ్బాక, నవంబర్ 9 {చైతన్య గళం}:

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సీఐ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత బెదిరింపులుగా మార్చడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దుబ్బాక సీఐ రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ తునికి సురేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాం నరేందర్,ఏఎమ్ సి డైరెక్టర్ ఆకుల భరత్,
వెంకటచారి,పోగుల రాజిరెడ్డి,గోపి తదితరులు పాల్గొన్నారు.