తండ్రీకూతుళ్ల మృతి బాధాకరం.. సతీష్ కుమార్ దిగ్భ్రాంతి
హుస్నాబాద్ నవంబర్ 9 {చైతన్యగళం}: సిద్దిపేట–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి చెందడంపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు...