CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 3:39 pm Posted by : rakeshkashaveni12@gmail.com

జర్నలిస్టు రవీందర్‌కు కొవ్వొత్తులతో ఘన నివాళి

హుస్నాబాద్, నవంబర్ 5 (చైతన్యళం):

అక్కన్నపేట మండలం గొల్లగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కాశబోయిన రవీందర్ (40) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంపై హుస్నాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. రవీందర్ మృతి జర్నలిజం రంగానికి, ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం వార్తా సమాచారాన్ని చేరవేస్తూ, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసిన మంచి జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు హనుమంతు నాయక్, అక్రమ్, వంశీకృష్ణ, ఠాకూర్ నర్సింగ్, దిలీప్, మార్క రాజు, మహమ్మద్ జావీద్, పచ్చిమట్ల నరేష్, మాటూరు గోపి, ఖాన్, షేక్ అక్బర్, నల్ల రాజిరెడ్డి, గూడూరు స్టీఫెన్, గంగారపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.