అధిక సాంద్రత పత్తి సాగుతో అధిక దిగుబడి
కపాస్ క్రాంతితో రైతులకు అదనపు ఆదాయం హుస్నాబాద్, నవంబర్ 5 (చైతన్యళం): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కపాస్ క్రాంతి’ పథకం ద్వారా పత్తి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని మండల వ్యవసాయ అధికారి పూజ తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో పంటను పూర్తి చేసుకుని, తదుపరి పంట సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. గురువారం మండలంలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నూజివీడు సీడ్స్‌కు...