మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జిల్లా సాధన సమితి విజ్ఞప్తి మిర్యాలగూడ, నవంబర్ 9 (చైతన్యగళం): మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఆర్డీవో రమణారెడ్డితో పాటు మిర్యాలగూడ పట్టణ మున్సిపల్ చైర్మన్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణకు వినతిపత్రాలు అందజేశారు. మిర్యాలగూడ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, సిమెంట్ కర్మాగారాలు, సహజ వనరులు, రైస్ మిల్లులు ఉన్నాయని, సాగర్ ఎడమ కాలువకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని గత పాలకులు జిల్లాగా...