CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 7:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జర్నలిస్టు భౌతికకాయానికి నివాళులర్పించిన కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

  • మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

అక్కన్నపేట, నవంబర్ 6 (చైతన్యగళం): అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామానికి చెందిన టీజీ 24 టీవీ ఛానల్ స్టాఫర్ జర్నలిస్టు కాశవేణి రవి గుండెపోటుతో అకాల మరణం చెందడం పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రవి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన గొల్లకుంట గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, కర్ణకంటి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, మధు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.