గిరిజనుల చిరకాల డిమాండ్‌కు పరిష్కారం

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుపై హర్షం సీఎం రేవంత్‌రెడ్డికి డి.టి. నాయక్ కృతజ్ఞతలు అక్కన్నపేట, నవంబర్ 6 (చైతన్యగళం): ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కాంగ్రెస్ నాయకుడు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ తిరుపతి నాయక్ (డి.టి. నాయక్) అన్నారు. ఈ నిర్ణయం గిరిజనుల చిరకాల డిమాండ్‌కు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు. అక్కన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులకు...