భూ సమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి లక్ష్యం
సిద్దిపేట, నవంబర్ 04 (చైతన్యగలం): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్ గ్రామంలో చేపట్టిన భూభారతి భూముల పునఃసర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు వందేళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల పునఃసర్వే చేపడుతోందని తెలిపారు. ముందుగా చిన్న గ్రామాలను ఎంపిక చేసి భూ...