రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ఆత్మహత్య కేసులో ఇరికిస్తానని బెదిరించి డబ్బుల డిమాండ్ ఆదిలాబాద్, నవంబర్ 04 (చైతన్యగలం): లంచం తీసుకుంటూ ఓ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి. రమేష్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లికాని యువతి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 194 కింద కేసు నమోదైంది. ఈ...