విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన
పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై వివరించిన ఎల్కతుర్తి ఎస్‌హెచ్‌ఓ ఎల్కతుర్తి, నవంబర్ 4 (చైతన్యగళం): విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి,...