ఎల్కతుర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి ఎల్కతుర్తి, నవంబర్‌ 4 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుకినె సంతాజీ, ఎల్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు ఐకేపీ (సెర్ప్‌), ఎల్‌ఎస్‌సీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వారు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తాము...