కండక్టర్‌ ప్రవళిక మృతికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలి

మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలి: టీఎంయూ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఎంపీ రెడ్డి హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (చైతన్యగళం): మణుగూరు డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవళిక మృతికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆమె మృతిపట్ల టీఎంయూ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తోందని తెలిపారు. బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు...